29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ సీఎం కేసీఆర్ ను ముట్టుకుంటే రాష్ట్రమంతా ప్రళయమే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిట్ విచారణ పేరుతో కేసీఆర్ పై అరాచకాలు ఆపాలి

 

. . . ప్రభుత్వ వైఖరి పై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో గన్నారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమంగా పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిరసనగా మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాశంకుమార్, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి గంగాదాస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ కు నిరసనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజలను, విద్యార్థి సంఘాలను చైతన్య పరుస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లిన మహా నాయకుడన్నారు. తెలంగాణ వచ్చుడో .. కేసీఆర్ సచ్చుడో .. అనే నినాదంతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానీయుడన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ముట్టుకుంటే రాష్ట్రమంతా ప్రళయంగా మారే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కేసీఆర్ పైన అరాచకాలను ఆపకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కొరకే కేసీఆర్ పైన నిందలు మోపుతూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారీ కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాశంకుమార్ మండల అధ్యక్షులు చిలివేరి గంగాధర్ సీనియర్ నాయకులు సర్పంచ్ అరేటి రఘు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article