29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉచితంగా ఫ్రిడ్జ్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రిడ్జ్ అవసరం ఉందని తెలుసుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివ కుమార్ ఉచితంగా అందజేశారని డాక్టర్ అంబిక తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నుండి కుక్క కాటు, పాము కాటు, కోతి, తేలు కాటు మందు అందుబాటులో ఉంటున్నాయని, ఈ  వ్యాక్సిన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కోరటంతో మందులు పంపించారన్నారు. ఈ మందులను పెట్టడానికి హాస్పిటల్లో ఒక ఫ్రిజ్ అవసరం ఉందని డాక్టర్ అంబిక శివకుమార్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే తన స్వంత రూపాయలతో ఫ్రిడ్జ్ ఖరీదు చేసి ఏర్గట్ల ప్రభుత్వ హాస్పిటల్ కు అందజేశారని పేర్కొన్నారు. అడిగిన వెంటనే ఉచితంగా హాస్పిటల్ కొరకు ఫ్రిడ్జ్ అందజేసినందుకు ఏర్గట్ల మండల హాస్పిటల్ డాక్టర్ అంబిక, హాస్పిటల్ సిబ్బంది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కి ప్రత్యేక కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంబిక మాట్లాడుతూ ఏర్గట్ల లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం డాక్టర్ హాస్పిటల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మండల పరిధిలోని  గ్రామాల ప్రజలు తమ యొక్క ఆరోగ్య సమస్యలు డాక్టర్ కి, సిబ్బందికి తెలిపి తమ యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించు కొనగలరని అన్నారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపెల్లి లింగారెడ్డి, తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్, ఏర్గట్ల ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి, శ్రీనివాస్, దోంచంద ఉప సర్పంచ్ ఆశిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, రోక్కెడ సంజీవ్, కూరాకుల బోర్రన్న, ఓర్సు రాములు, మేకల సాయన్న, కూరాకుల సాయన్న, మునిమాణిక్యం అజయ్, మాదస్తు చిన్నయ్య, డాక్టర్ అంబిక, హెచ్ ఈ ఓ మోతిరాం, పిహెచ్ఎన్, ఇందిర, హెల్త్ సూపర్వైజర్ సూపర్వైజర్ విజయ, హెల్త్ అసిస్టెంట్ పండరి, మోహన్, పిహెచ్ సి హాస్పిటల్ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article