29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీజేపీ పార్టీ అభ్యర్థులకు బిఫాం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు బాన్సువాడ మున్సిపాలిటీ ఇంచార్జ్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో 17 అభ్యర్థులో 15 అభ్యర్థులకు బీఫామ్ అందించారు. మిగిలిన ఇద్దరికీ రేపు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్న రాజులు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి చేసిన సేవలను చూసి మీకు బీఫామ్ ఇవ్వడం జరిగిందని, ఈరోజు నుండి ఎలక్షన్ ముగిసే వరకు 18 గంటలు కష్టపడి పనిచేసి అత్యధిక కౌన్సిలర్లను గెలిసి బాన్సువాడ మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలు ముందుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాన్సువాడ మున్సిపాలిటీ ఇంచార్జ్ ఇంద్రసేనారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, సాయి రెడ్డి, దాకాయ్య, బీర్కూర్ మండల అధ్యక్షులు సాయికిరణ్, నసుల్రాబాద్ మండలం అధ్యక్షులు హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article