. . . ఆలయ అధ్యక్షుడు ఆమంద్ విజయ్ కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి ఆలయంలో నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. అన్నదానం మహాదానం అనే స్ఫూర్తితో ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు ఆమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తున్నామని తెలిపారు. ప్రజలు తండోతండాలుగా వస్తుండడంతో వారికి అమ్మవారి ఆశీస్సులతో తొమ్మిది రోజుల పాటు నిత్యన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఐదు రోజులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన నాలుగు రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, దాతలు సహకరించాలని కోరారు. ఈ పవిత్ర సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

