31.9 C
Hyderabad

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎఇ

Electricity Department AE caught by ACB while taking bribe

Must read

📰 Generate e-Paper Clip

 

.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన మీటర్లకు అప్రూవల్ కోసం రూ.1.20 లక్షల లంచం

వెబ్ డెస్క్, బతుకమ్మ:

ఆన్ లైన్ లో కొత్తగా ఆరు కరెంటు మీటర్ కోసం దరఖాస్తు చేసిన  వాటి అప్రూవల్ కోసం లంచం అడిగి ఏసీబీ చిక్కారు విద్యుత్ శాఖ ఎఇ ఒక్కరు. హైదరబాద్ లోని సంతోష్ నగర్ సబ్ డివిజన్ లోని మాదన్నపేట్ టిజిఎస్ పిడిసిఎల్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పండ్ల సంధ్య రాకేష్ విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత సెక్షన్ పరిధిలోని నివాసి ఒకరు కొత్తగా ఆరు మీటర్ల ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన వాటికి అధికారులు అప్రూవల్ ఇవ్వలేదు. దీంతో బాధితుడు ఎఇ సంధ్య రాకేష్ ను సంప్రదించగా రూ.1.20 లక్షల లంచం ఇస్తేనే అప్రూవల్ చేస్తానని తేల్చి చెప్పాడు. బాధితుడు ఎసిబిని ఆశ్రయించగా సెక్షన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఎఇ సంధ్య రాకేష్ ను ఎసిబి సిటి రెంజ్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

More articles

Latest article