. . . నిర్మాణుష్య ప్రాంతంలో పసికందును పారేసిన వైనం
. . . ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి
నందిపేట్, బతుకమ్మ:
మాతృత్వం మంట కలిసింది.. అప్పుడే పుట్టిన పసికందును నిర్మాణుశ్య ప్రాంతంలో విసిరేసిన వైనం ఆదివారం వెలుగు చూసింది. ఈ సంఘటన నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెల్లింది కర్కశకులు. స్థానికంగా కొందరు పిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మానుస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమసంతానమో.. తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విసిరివేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
