24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విజేతలకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ :

 

జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ మెండోరకు చెందిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలు (ఎల్టా) నిజామాబాద్ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ లో నిర్వహించిన ఉపన్యాస విభాగంలో విజేత లైన అంగ ఆర్తి జెడ్పిహెచ్ఎస్ మెండోరా, ఒలింపియాడ్ సీనియర్ విజేత ఎండి సోనా, జూనియర్ విభాగంలో ఏ శ్రేయస్ సాధించినందుకు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ లు కుంట లక్ష్మీ, రమేష్ విజేతలను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ విషయాన్ని మిగతా విద్యార్థులు కూడా స్పూర్తిగా తీసుకొని పోటీ పరీక్షలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పల్లె శేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article