24.7 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం

Must read

📰 Generate e-Paper Clip

. . . పీవోడబ్ల్యూ డివిజన్ ప్రెసిడెంట్ పి. రమ

 

సిరికొండ, బతుకమ్మ :

 

క్రీడల వల్ల మనిషికి మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డివిజన్ ప్రెసిడెంట్ పి. రమ అన్నారు. మంగళవారం మండలంలోని తూంపల్లి గ్రామంలో నిర్వహించిన పీవోడబ్ల్యూ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సమావేశమనంతరం మహిళలకు క్రీడోత్సవం కార్యక్రమం లో పాల్గొని ఆమె ప్రసంగించారు. సమాజంలో గ్రామీణ క్రీడలు కనుమరుగయి నేటి తరానికి వాటిపై అవగాహన తగ్గిందన్నారు. దీనివల్ల గ్రామాల్లో క్రీడలు జరగడం లేదన్నారు. మహిళల్లో ఐక్యతకు, మానసిక దృఢత్వానికి, స్నేహాభావం పెంపొందెందుకు క్రీడలు ఎంతో అవసరమని, ప్రభుత్వం గ్రామీణ క్రీడల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం  (పిఓడబ్ల్యు)అనేక సంవత్సరాలుగా మహిళలకు క్రీడలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు ఈ సందర్భంగా తమ చైతన్యాన్ని పెంపొందించుకొని స్త్రీ,పురుష సమానత్వం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, పివోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షలు వి సత్తెవ్వ, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్ పుష్పలత,  మండల ప్రధానకార్యదర్శి జమున, డివిజన్ నాయకులు పద్మ, స్వరూప, ఎం.లత, ఎం.లక్ష్మి, ఏఐపీకెఎంఎస్ జిల్లా నాయకులు ఎం.సాయరెడ్డి, జిల్లా నాయకులు జె బాల్ రెడ్డి, జె ఎర్రన్న, ఏఐయుకెఎస్ వి భూమాగౌడు, ఎం.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article