. . . ఆర్మూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఘటన
. . . కామారెడ్డి జిల్లా అరెడు పల్లికి చెందిన విద్యార్థిగా గుర్తింపు
. . . ఇంటి నుంచి వచ్చిన రెండు రోజులకే బలవన్మరణం
ఆర్మూర్, బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అరేపల్లె గ్రామానికి చెందిన గడ్డం సంతోష్(17) వేల్పూర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో బైపిసి ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, ఆర్మూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కలిపి నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం సొంత గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిన సంతోష్ శనివారం ఉదయం హాస్టల్ ఆవరణలోని నర్సరీ వద్ద చెట్టుకు టవల్ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో పాటు నిద్రలేచిన సంతోష్ ఆత్మహత్యకు పాల్పడటం తోటి విద్యార్థులు కలిసి వేసింది. సంతోష్ ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. హాస్టల్ అధికారులు ఆర్మూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు
