. కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
కామారెడ్డి, బతుకమ్మ: బీబీపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులానికి సొంత భవనం నిర్మించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీబీపేట మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలకు సొంత భవనం లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
