25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రెంజల్ లో చేప పిల్లల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

రెంజల్, బతుకమ్మ: మండలంలోని 11 మత్స్యసహకార సంఘాలకు 6,00,300 చేప పిల్లలను సోమవారం పంపిణీ చేశారు. చేప పిల్లలను 24 చెరువుల్లో వదలనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కట్ల, బంగారు తీగ, శీలావతి రకం చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంజనేయస్వామి, రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కస్ప శ్రీనివాస్, మత్స్యకార సంఘం నాయకులు శంకర్, శ్రీనివాస్, ఎల్లయ్య  మాజీ ఎంపీపీ మోబీన్ ఖాన్, స్థానికులు పాల్గొన్నారు.

More articles

Latest article