27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా పెద్దమ్మ తల్లి 15వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

  • ఉత్సవాలలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

ఇందల్వాయి,బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శ్రీ వన దుర్గాదేవి (పెద్దమ్మతల్లి)ఉత్సవాలను శనివారం నుండి ఘనంగా జరుపుతున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో పాడిపంటలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క పండగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పెద్దమ్మతల్లి 15వ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి మందిరం అభివృద్ధికి తన వంతు కృషి గా 10 లక్షలు ఫంక్షనల్ మండపానికి ఇవ్వనున్నట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఉరువలేకనే తమ ప్రభుత్వం పైన బిజెపి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా బాధాకరమన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాజ్యాంగాన్ని మార్చాలనడం ఎంతవరకు సమంజసం అన్నారు.మరోవైపు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి బ్రష్టు పట్టించిందన్నారు.బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని పేర్కొన్నారు ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నట్లు తెలిపారు.అనంతరం ముదిరాజ్ గ్రామస్తులు అమ్మవారికి ఆడపడుచులు  ఇంటింటికి బోనాలు తీసి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.పెద్దమ్మతల్లి పండగకు భారీగా జనాలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్న సత్రం నిర్వహించారు. సోమవారం రోజున అమ్మవారికి బలి కార్యక్రమం సమర్పించి వన భోజనాలకు వెళ్ళనున్నట్లు ముదిరాజ్ ఆలయ కమిటీ అభివృద్ధి సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ   ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,అమృతపూర్ గంగాధర్,ఎన్డీసిసిబి డెరైక్టర్ ఆనంద్,పార్టీ గ్రామ అధ్యక్షులు సాహేంధర్, ఆలయా అభివృద్ది కమిటీ సబ్యులు లోకాని గంగారరం,వాచర్ మల్లయ్య ,గంగా సాయులు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ గోపాల్,లోకాని గోపి,మెండే అశోక్, కేపీ గంగారం,చంటి, అసది డా,పరమేష్,దశరథ్, నారాయణా,గండి తండా బాబురావు, వెంగాల్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article