దారిలోనే ధాన్యం బస్తాల మాయం
రైతుల ధాన్యం మిల్లులకు చేరక ముందే తస్కరణ నందిపేట మండల కేంద్రంలో ఘటన రైతులు తీసిన వీడియో వైరల్ నిజామాబాద్, బతుకమ్మ: ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతులు అడుగడుగున దోపిడీకి గురవుతున్నారు. నకిలీ విత్తనాలు మొదలుకొని పంట కోసి సంబంధిత ధాన్యం అమ్మకానికి వెళ్లే వరకు దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి... అధికారులు మారుతున్నారు... కాని దోపిడీకి మాత్రం చెక్ పడటం లేదు. ధాన్యాన్నిదళారుల పాలుకాకూడదని ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుందని సొసైటీలకు, మహిళా సమాఖ్యలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు...