27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా అంబేద్కర్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామ కార్యదర్శి భరత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా మోత్కూర్ నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ మత విభేదాలు లేకుండా ఒకే తాటిపైకి వచ్చి తమ యొక్క హక్కుల కొరకు అంబేద్కర్ రచించిన సూచన ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్, రాములు, శివ, ప్రవీణ్ కుమార్, యువకులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article