బాన్సువాడ , బతుకమ్మ :
బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ శివారులో ధాన్యం లారీ బోల్తా పడింది. బుడిమి సహకార సంఘం పరిధిలోని మొగులాన్ పల్లి కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం లోడ్ చేసుకుని శుక్రవారం రాత్రి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. దుర్కి రైస్ మిల్లుకు తరలిస్తుండగా సోమేశ్వర్ శివారులో మూలమలుపు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది.
