👉 సర్జరీకి వెళ్లకముందు తీసి ఉంచిన రెండు తులాల బంగారు ఆభరణాలు అపహరణ
👉 జిజిహెచ్ లో భద్రతా వైఫల్యం
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నిజామాబాద్ నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన బంగారం అపహారాణకు గురైంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వర్ని మండలం చెందిన మహిళ శస్త్రచికిత్స కోసం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం సర్జరీ నిమిత్తం ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళకముందు ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు నగలను తీసి పక్కన ఉంచారు. సర్జరీ తర్వాత చూసుకుంటే నగలు కనిపించలేదు దానితో బాధిత కుటుంబ సభ్యులు ఒకటి ఒకటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. జి జి హెచ్ లో సిఐఎస్ఎఫ్ భద్రతతో పాటు స్థానిక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉండగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ మహిళలకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఆపహరణ గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
