29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మా భూమిని మాకు ఇప్పించండి సారూ ..

Must read

📰 Generate e-Paper Clip

– స్థానిక ఆర్ఐ దొంగ పట్టా చేశాడా ..?

– అక్రమంగా భూమి కబ్జా ..

– భూ కబ్జాదారుల బెదిరింపులు ..

–  న్యాయం చేయండి అంటూ బాధితుల వేడుకోలు

– న్యాయం జరగని యెడల పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటాం : బాధితులు

రుద్రూర్, బతుకమ్మ  : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారులో గల ఎకరం 5 గుంటలు అప్పటి ఇందిరా గాంధీ హయాంలో (1977) 47 సంవత్సరాల క్రితం బీదవారికి  ప్రభుత్వ పట్టాలు అందజేశారు. అలా చాలామందికి అసైన్మెంట్ నాటి తహసిల్దార్ బీద ప్రజలకు పంపిణీ చేశారు. ఫైనల్ పట్టా కూడా ఇచ్చారు. అందులో వ్యవసాయానికి పనికొచ్చేవి కొన్ని ఉంటే బీడు భూములు మరికొన్ని ఉన్నాయి. కొడుకు సాయిలు వ్యవసాయ భూముల కోసం, భూమి చదును కోసం ఇటుక బట్టీలకు పట్టి స్థలాన్ని చదును చేసి ఇచ్చారు. చదును అయిన తర్వాత ఉలువలు, వరి వంటివి పండించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు నీరు లేక ఏ పంట వేసిన ఎండిపోతూ ఉండడంతో నీటి సౌకర్యం లేకపోవడంతో చేసేది ఏమీ లేక కొన్నేళ్ల వరకు పంట కాలువలు నీరు వచ్చేదాకా చూసి ఏదైనా పంట వేద్దామనుకోని 2019లో ముళ్లపదలు పెరగడంతో జెసిబి సహాయంతో వాటిని తొలగించే క్రమంలో అక్బర్ నగర్ కు చెందిన హనుమంతరావు దేశాయ్ చదును చేస్తుండగా వచ్చి అక్రమంగా జెసిబీని ఆపివేసి అక్కడ ఉన్నది ఎస్సీ కుటుంబానికి చెందిన వారని, కుటుంబీకులు కంచపల్లి సాయిలు గంగామణి వారి కొడుకులను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపొండి లేకపోతే చంపేస్తాం, మీపై కేసులు చేస్తాం అంటూ పలు బెదిరింపులకు పాల్పడడంతో వారు భయభ్రాంతులకు గురై గత ఐదేళ్లుగా మళ్లీ ఎలా ఒకలాగా పండించాలి అనుకున్నారు. కానీ వీరి దౌర్జన్యం మరింతగా పెరిగిపోయింది.

Give us our land sir..

ప్రభుత్వం ఇచ్చిన భూమి వారు పట్టా చేసుకున్నామని ఆదివారం సెలవు దినం అయినప్పటికీ దొంగ చాటున జెసిబితో చదును చేస్తుండగా, గమనించిన కొందరు చెప్పగా వెళ్లి చూడగా వారు ఇష్టానుసారంగా భూములను చదును చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఇది మా పేరుపై పట్టా ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడినుండి వెళ్లిపోయారు. సర్వేనెంబర్ 242/1 ఎకరం 5 గుంటలు కలదు. స్థానిక తహసీల్దార్ కు, ఆర్ఐకి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సక్రమంగా రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఆర్ ఐ దొంగ పట్టాలు ఏమైనా ఇచ్చారా?.. ఒక ఎస్సి కుటుంబానికి చెందిన ప్రభుత్వ భూమిని బీసీ వర్గానికి చెందిన దేశాయ్ ల పేరిట పట్టా ఎలా అవుతుందని స్థానికులు, కొంతమంది పెద్ద మనుషులు సైతం వారికే వత్తాసు పలకడంతో ప్రభుత్వం ఇచ్చిన ఫైనల్ పట్టా ఒకవేళ క్యాన్సిల్ అయిన ప్రభుత్వానికి చెందుతుంది. తప్ప ఇతర వర్గాల వారికి ఎలా చెందుతుందని, అదే స్థలం దగ్గరికి వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ లేని యెడల పురుగుల మందు అదే స్థలంలో సేవించి చనిపోతామని వారు తమ గోడును విలేకరితో వెళ్ళబోసుకున్నారు కంచపల్లి సాయిలు, కంచపల్లి గంగామణి. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్న న్యాయం జరుగుతా లేదని కన్నీరు మున్నీరయ్యారు. ముఖ్యంగా ఆర్ఐ అత్యుత్సాహం వల్లే ఇలా దొంగ పట్టాలు చేసుకుని పేదవారి కడుపు కొడుతున్నారని అన్నారు. స్థానిక ఆర్ఐ దొంగ పట్టా చేశాడా…? సర్వే సకాలంలో ఇవ్వకుండా సర్వేయర్ రెండు నెలలకు పైగా తిప్పించుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల కడుపు కొట్టి పెద్దలకు దోచిపెడితే ఎలా అని ప్రభుత్వ సొమ్ము బీదలకు ఇచ్చిన ఫైనల్ పట్టా ఉన్నా కానీ పట్టాదారులకు భయభ్రాంతులకు గురిచేసి అడ్డదారిలో దొంగ పట్టా చేయించుకుని పాల్పడుతున్న ఘటన అక్బర్ నగర్ లో చోటు చేసుకుంది. ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేస్తామని రైతు కంచపల్లి సాయిలు తెలిపాడు.

Give us our land sir..

More articles

Latest article