బతుకమ్మ, వేల్పూర్: వరంగల్ లోజరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి10 కిలోమీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో వేల్పూర్ వాసి అశోక్ విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామానికి చెందిన గుగ్గలం అశోక్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్డా క్టర్ మోహన్ దాస్ చేతులుమీద అశోక్ గోల్డ్ మెడల్ తో సర్టిఫికేట్ ఆదివారం అందజేశారనితెలిపారు.ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ ప్రిన్సిపల్ అశోకు ను అభినందించారు.డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ యువకులు అశోక్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. యువతకుఆదర్శంగా ఉండాలని తెలిపారు.అశోక్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలోఉన్నఆర్టీవో కార్యాలయంలోనిధులు నిర్వహిస్తూ జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని అథ్లెట్ రాణిస్తూ ఎన్నో విజయాలు సాధించారన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.యువకులు వేల్పూరు గ్రామస్తులు అశోకుని అభినందించారు.
