24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పేషెంట్ కేర్ టేకర్ల కబంధ హస్తాల్లో జీజీహెచ్

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రొఫెసర్ల అటెండెన్స్ వేసేది కేర్ టెకరే
  • రెగ్యులర్ ఉద్యోగులపై పెత్తనం వారిదే
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైనా, కాంట్రాక్టర్లయినా వారు చెప్పింది వినాల్సిందే
  • హాజరు పేరుతో లైంగిక వేదింపులు
  • కాసులు ఇచ్చిన వారికి హాజరు . . . క్లీన్ చీట్ లు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) పేషెంట్ కేర్ టెకర్ల కబంధ హస్తల్లో చిక్కుకుంది. వారి వెనుక పొలిటికల్ లీడర్లు లేరు. ఉన్నదల్లా ఒకే ఒక్కరు. సూపరింటెండెంట్ అంటే జీజీహెచ్ స్వయం ప్రతిపత్తికలిగిన సంస్థకు అధినేత అనే ఫీలింగ్ కొనసాగుతుంది. దానితో అక్కడ రెగ్యులర్ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై పేషెంట్ కేర్ టెకర్లను నియమించి అన్నీ కార్యకలాపాలు వారితోనే చేయించే కల్చర్ నడుస్తోంది. పేషెంట్ కేర్ టేకర్లంటే ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా ఉండే పోస్టులు. అది కూడా ఔట్ సోర్సింగ్. కానీ వారి పెత్తనం కర్రపెత్తనమైంది. అధికారి అండదండలు ఉండడంతో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పీఏ పోస్టు పుట్టుకొచ్చింది. కేర్ టెకర్ కంప్యూటర్ ఆపరేటర్ అయ్యారు. సెక్యూరిటీ పై ఇంచార్జి వారే. సానిటేషన్ వారి కనుసన్నుల్లోనే నడువాలి. ఆసుపత్రిలో ఎవరైనా ప్రవేశించాలన్నవారు చెప్పిందే వేదం. ఇదంతా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో కేర్ టెకర్ల అనే పోస్టులో నియామకమైన వారి పెత్తనాల చిన్నచిట్టా మాత్రమే.

ఆసుపత్రిలో తాత్కాలికంగా పొలిటికల్ లీడర్లు, అధికారులు తమ కుటుంబ సభ్యులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పేషెంట్ కేర్ టెకర్లుగా నియామకాలు చేసుకుని వారి చేతనే జీజీహెచ్ లో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి దాపురించింది. ఆసుపత్రిలో స్ట్రేచర్లు తీసుకు వెళ్లే సహాయకులు లేరని జరిగిన సంఘటనలు కొకొల్లాలు. కానీ అవే పోస్టులలో నియమితులైన వారు ఎన్నడు కూడా ఆఫ్రాన్ వేయకుండా, ప్రొఫెసర్ లతో పాటు రెగ్యులర్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ ఎంలు చివరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం బెదిరించే పరిస్థితి నెలకొంది. జిల్లా ఆసుపత్రిలో పని చేసే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఇచ్చినా అక్కడ కూడా కేర్ టెకర్లదే పెత్తనం. సూపరింటెండెంట్ పీఏలు, డ్రైవర్లు కూడా కేర్ టెకర్లు కావడంతో వారు చీమచిట్టుక్కుమన్నచెప్పే విధంగా కొటారి తయారు చేశారు. సానిటేషన్, సెక్యూరిటీలపై ఇంచార్జిలు కూడా కేర్ టెకర్లే. చివరకు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలోనూ కేర్ టెకర్ల పెత్తనం ఉండాల్సిందే. నర్సింగ్ సూపరింటెండెంట్లు గెజిటెడ్ అధికారులయినప్పటికీ, రెగ్యులర్ ఉద్యోగులైనప్పటికీ కేర్ టెకర్లు చెప్పింది వినాల్సిందే. ఆసుపత్రికి వచ్చే మీడియాతో పాటు ఎవ్వరిని కలువాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. కాంట్రాక్టర్లు అయినా మరెవ్వరైనా వారిని మచ్చిక చేసుకోవాల్సిందే. లేకపోతే వేదింపులే. ఆఫీసర్ మీపై సీరియస్ గా ఉన్నారని యాక్షన్ తీసుకుంటారని, మెమోలు ఇస్తారని బెదిరించడం ఇటీవల అక్కడ వేదింపులు పెరిగాయి. ఇటీవల పలువురు మహిళ ఉద్యగినిలపై వెలుగు చూసిన వేదింపుల ఉదంతాలే ఉదాహరణగా చెప్పాలి.

More articles

Latest article