- ఇద్దరు ఉద్యోగులపై రహస్య విచారణ
- కేసు నమోదుకు బాధితుల వివరణ కోసం అధికారుల యత్నాలు
నిజామాబాద్ , బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మహిళా ఉద్యోగుల వేధింపులపై బతుకమ్మలో ప్రచురితమైన కథనానికి అధికారులు నివ్వెరపోయారు. గతంలో పనిచేసిన ఓ అధికారి కొంత మంది సిబ్బందితో కలిసి చేసిన వ్యవహారాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మహిళా ఉద్యోగినుల వేధింపుల ఘటన చర్చనీయంశంగా మారింది. దీనిపై అధికారులు రహస్య విచారణ చేపట్టారు. సదరు పేషెంట్ కేర్ విభాగానికి చెందిన ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. ఎవరితో ఇలా వ్యవహరించారు, లైంగిక వేధింపులకు గురైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని గుర్తించారు వారి నుండి వివరణ తీసుకొని పోలీస్ కేసు నమోదు చేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో గత అధికారికి పీఏగా చెప్పుకుంటూ ముగ్గురు మహిళ ఉద్యోగినిలపై లైంగిక వేధింపులకు గురి చేసిన తాత్కాలిక ఉద్యోగిని గుర్తించిన అధికారులు అతని వ్యవహారాలను నివేదిక రూపంలో సిద్ధం చేశారు. పేషెంట్ కేర్ విభాగానికి చెందిన సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని డాక్టర్ అనే పేరుతో పిలిచేవారంటే ఆయన ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. సదరు అధికారి కూడా అతను చెబితే నేను చెప్పినట్టే అని బహిరంగంగా చెప్పడంతో అతని ఆగడాలు అంతాఇంతా కాదు. ఇదే ఆగడాలతో ఆసుపత్రిలోని అన్ని పనులు చక్కబెట్టుకొని మహిళలను వేధింపులకు గురి చేశాడు. మరి కొంతమంది ఉద్యోగినిలు ఇతని వేధింపులకు బలైనట్టు ఆరోపణలున్నాయి. ఓ సీనియర్ మహిళ ఉద్యోగిని సైతం ఇతని ఇబ్బందులకు గురైనట్లు గురువారం బతుకమ్మ కథనంతో బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై చర్చించుకున్న ఉద్యోగినిలు సాధారణ తాత్కాలిక ఉద్యోగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు. కాగా అధికారి బదిలీ వ్యవహారం తర్వాత లైంగిక వేధింపుల వ్యవహారం ప్రస్తుత అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. పైగా ఏడు అంతస్తులు తాత్కాలిక ఉద్యోగి కేటాయించిన గది నిబంధనలకు విరుద్ధమని గుర్తించారు. ఇక్కడ ఎవరెవరు విధులు నిర్వర్తించారు, ఏఏ మహిళలు ఈ గదిలోకి వెళ్లారన్నది సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్నారు. ఇందులో ఇబ్బందులకు గురి అయిన వారిని గుర్తించి వారి నుంచి వివరణ తీసుకొని తక్షణమే సదరు తాత్కాలిక ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గత అధికారి వ్యక్తిగత ఆస్తి వ్యవహారాలను కూడా ఆరా తీస్తున్నారు. కేవలం పేషెంట్లను స్ట్రేచర్ పై తీసుకువచ్చే వ్యక్తి డాక్టర్ స్థాయి అధికారులు పిలవబడ్డాడు. ఈ వ్యవహారంలో గత అధికారి చేసిన తప్పిదాలు మామూలు ఉద్యోగులు ముఖ్యంగా మహిళ ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనను ప్రస్తుతాధికారులు సీరియస్ గా తీసుకొని నివేదికను రాష్ట్ర వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులకు సమర్పించానున్నారు.
- మీరు ఎవరితో ఏమీ మాట్లాడవద్దు . . . జాగ్రత్తగా ఉండాలి..
బతుకమ్మలో లైంగిక వేధింపుల కథను వెలువడంతో ఉద్యోగిలను వేధించిన ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులతో పాటు మరో ముగ్గురు గత అధికారిని కలిసి ఏం చేయాలి?ఎలా చేయాలి అని చర్చించినట్లు తెలిసింది. గతంలో మమ్మల్ని బాగా చూసుకున్నారు. ప్రస్తుతం మా పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేయడంతో . . .మీరు ఎవరితో ఏమీ మాట్లాడవద్దు . . . జాగ్రత్తగా ఉండాలంటూ సదరు అధికారి చెప్పినట్లు సమాచారం. ఉన్నతాధికారులు దీనిపై లోతుగా విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
