25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓంటరి మహిళ హత్య

Must read

📰 Generate e-Paper Clip

. . .ఆమే ఓంటిపైన ఉన్న బంగారు నగల అపహరణ

. . . ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

 పిట్లం, బతుకమ్మ:

ఓంటరిగా నివశిస్తున్న మహిళ హత్యకు గురైంది. ఆమే ఓంటిపైన ఉన్న నగలను అపహరించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా  పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామానికి చెందిన గొరిగే సత్యవ్వ (55)  తన ఇంటిలోనే హత్యకు గురైంది. గురువారం సాయంత్రం సత్యవ్వ అన్న పాపుగొండ సత్యవ పొద్దున్నుంచి కనిపించడం లేదని ఆమె ఇంటికి వెళ్లి చూడగా సత్యవ్వ ఇంట్లో  చనిపోయి ఉంది. ఆమె ముక్కునుండి నోటి నుండి రక్తం కారి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. అని ఆమె ఒంటిపై ఉన్న నగలు కనిపించలేదు . దానితో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సత్యవ్వ ఒంటరిగా ఉన్నది చూసి ఆమెను చంపి అట్టి బంగారాభరణాలు ఎత్తుకుపోయి ఉంటారు అని మృతురాలి అన్న గొరిగే పాపు గొండ  ఫిర్యాదు ఇవ్వగ పిట్లం పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

More articles

Latest article