23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

 జిల్లాలో గంజాయి అడ్రస్ లేకుండా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 . . . మోర్తాడ్ ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి

 మోర్తాడ్ , బతుకమ్మ :       

గ్రామాల్లో గంజాయి అనేది కనబడకుండా,  దాని పేరు వినపడకుండా దాని అడ్రస్ లేకుండా రూపుమాపాలని తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు, నిజామాబాద్  జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సోమవారం ప్రాహిభీషన్, ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు.

Ganjai should be done without address in the district


నూతన భవనమును ప్రారంభించి అనంతరం అన్ని రూములను పరిశీలించి వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. తమ పరిధిలో ఒకే గంజాయి కేసు నమోదు అయిందని అధికారులు సమాధానం ఇచ్చారు. కల్లులో కలిపే ఆల్ప్రజోలం సరఫరా జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎక్సేజ్ శాఖ కానిస్టేబుల్ ల్లు ప్రమోషన్ విషయంలో నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టెబుల్ అసోసియేషన్ వినతిపత్రం సమర్పించగా దానికి సానుకూలంగా స్పందించారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ ఆర్డిఓ రామా గౌడ్,  రాష్ర్ట కో అపరేటివ్ యూనియన్ సోసైటి చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ర్ట సీడ్ డేవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి సునీల్ రెడ్డి, ఎక్సైజ్ డిసి సోమిరెడ్డి, సూపరింటేండేంట్ కే. మల్లారెడ్డి, మోర్తాడ్ సీఐ గుండప్ప ,ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ganjai should be done without address in the district

 

More articles

Latest article