కామారెడ్డి, బతుకమ్మ : కల్లుబట్టిలో కల్లు సేవిస్తున్న వ్యక్తిని మాటల్లో దించిన మహిళ లిప్ట్ అడిగి పథకం ప్రకారం తన గ్యాంగ్ తో కలిసి దొచుకున్న వారిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి అధనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. దోపిడి జరిగిన 48 గంటలలో టెక్నాలజీతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోమవారం కామారెడ్డిలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎఏస్పి వెల్లడించారు. ఎఏస్ పి తెలిపిన కథనం ప్రకారం ఈ నెల 19న కామారెడ్డి జిల్లా దోమకోండ మండలం చింతమాన్ పల్లికి చెందిన చిన్న గంగయ్య అనే వ్యక్తి పనినిమిత్తం కామారెడ్డికి వచ్చి స్థానిక పట్టణ శివారులో కల్లుబట్టిలో కల్లు సేవించాడు. అక్కడ పాల్వాంచ మర్రి గ్రామానికి చెందిన కడమంచి లక్ష్మీ ఆలియాస్ హైమద్ బీతో మాట కలిపింది. తాను చింతమాన్ పల్లికి వెళ్తున్నట్లు తెలుపుతున్నట్లు దారిలో తనను దించాలని బ్రతిమాలుకుంది. బైక్ పై ఇద్దరు కలిసి వెళ్తుండగా కామారెడ్డి శివారులోని నవాబ్ వెంచర్ దాటి తర్వాత మహిళ బండి ఆపమని చెప్పడంతో అక్కడ పాల్వాంచ మర్రి గ్రామానికి చెందిన షేక్ జావిద్, కామారెడ్డి కసాబ్ గల్లికి చెందిన షేక్ అబ్బులు చిన్నగంగయ్యను తన భార్యను ఎక్కడికి తీసుకెళ్తున్నావని బెదిరించి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, పర్సును లాక్కున్నారు. సాంకేతిక పరిజ్నంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14770 నగదు, మూడు సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు గతంలోనూ కామారెడ్డి లోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్ట్ అడిగినట్లు నమ్మించి తన సన్నిహితుల ద్వారా దోచుకున్నట్లు విచారణలో అంగీకరించారని ఏఎస్పీ తెలిపారు. 48 గంటల్లో కేసును చేదించిన కామారెడ్డి సిఐ నరహరి, సీసీఎస్ సిఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉస్మాన్, వినయ్ సాగర్, సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారని తెలిపారు.