30.9 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  :  లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో పూర్ణిమ ఎంటర్ప్రైజెస్ పెట్రోల్ బంక్ రుద్రూర్, బాబా ఫిల్లింగ్ స్టేషన్ నిజామాబాద్, శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ల వారి సహకారంతో శనివారం  రుద్రూర్ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంపులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్, లలిత హాస్పిటల్ రుద్రూర్, లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్ వారిచే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 108 రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, బిపి, షుగర్, ఈసీజీ పరీక్షలను నిర్వహించారు. అదేవిదంగా 9 మంది కంటి రోగులకు కంటి ఆపరేషన్ నిమిత్తం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే 25 మంది డ్రైవర్లు, క్లీనర్లకు ఉచితంగా ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ను చేయించి ఇవ్వడం జరిగిందని భారత్ పెట్రోలియం టెరిటరీ మేనేజర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ ఆఫీసర్ రితేష్, ఇంజనీర్ అరుణ్, నర్సా గౌడ్, గంగారెడ్డి, ఎం.వి గంగారం, శివ సాయి ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ప్రతినిధులు కేవీ మోహన్, శ్యాంసుందర్ పహాడే తదితరులు పాల్గొన్నారు.

Free Mega Health Camp under the auspices of Lions Club

More articles

Latest article