27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

Must read

📰 Generate e-Paper Clip

  • ముఖ్యమంత్రిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించమని ఇటీవల అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడిన విషయం తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధికి రావలసిన పెండింగ్ నిధులు టీ యూ ఎఫ్ ఐ డి సీ ఫండ్ 60 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్లు,స్పెషల్ ఫండ్ వంద కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే నియోజకవర్గనికి ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరుకై ముఖ్యమంత్రి ఛాంబర్ లో రేవంత్ రెడ్డి కి సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తో కలిసి వినతిపత్రం అందించారు. ఇందూర్ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నానని, వివక్ష చూపకుండా అర్బన్ నియోజకవర్గనికి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కావలిసిన నిధులు త్వరలో మంజూరు చేస్తాం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Allocate funds for constituency development

More articles

Latest article