27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అమిత్ షా వ్యాఖ్యలను వెనక్కి తెలుసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని  ఐ ఎఫ్ టి యు.ద్వారక నగర్ నగర కమిటీ ఆఫీసులో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా చేసిన వాక్యాలను సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యు లు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలాంటి వాక్యాలు చేయటం దురదృష్టకరమని అన్నారు.  తక్షణమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నగర నాయకులు రాజు, మోహన్, ప్రసాద్, ఇర్ఫాన్, సురేష్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article