30.9 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు . డాక్టర్ అబ్దుల్ రజాక్ దంత వైద్య నిపుణులచే దంత వైద్య పరీక్షలపై అవాగాహన కల్పించడం జరిగింది. ఎటువంటి దంత సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో 186 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే విద్యార్థులకు బిస్కెట్లు, కేక్ ప్యాకెట్లు, పండ్లు, అందరికి టూత్ పేస్ట్ లు అవసరమైన వారికీ మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రుద్రూర్ అధ్యక్షులు కే.వి.మోహన్, లయన్స్ క్లబ్ భవాని అధ్యక్షులు వై.రవీంద్రబాబు, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు లయన్ శ్యాంసుందర్ పహాడే, లయన్ రమేష్, లయన్ తాహెర్, లయన్ మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయ బృందం ఖాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article