27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏ ఐ ఎస్ ఎఫ్ డిమాండ్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో సోమవారం శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని సోమవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యాసంస్థలకు ఈటెక్నో,టెక్నో అనే తోక పేరుతో విద్యా హక్కు చట్టం నిబంధనలు ప్రకారం నడపటం నేరం కానీ శ్రీ చైతన్య విద్యాసంస్థలు యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు విద్యార్థులకు స్కూల్ టైమింగ్ కాకుండా గూపన్పల్లిలో గల శ్రీ చైతన్య పాఠశాలలో హాస్టల్ పర్మిషన్ లేకుండా హాస్టల్ నడిపిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. దాంతోపాటు విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోవడం దాంతోపాటు నేలకు ఒక టీచర్స్ మారడం ప్రిన్సిపాల్ మారడం విద్యార్థులు దీని ద్వారా సబ్జెక్టు నైపుణ్యాన్ని కోల్పోతున్నారని అన్నారు. విద్యార్థులకు సరిపడా స్థానిక సౌకర్యాలు ఏమీ లేనందున వేలల్లో ఫీజు వసూలు చేస్తున్న పట్టించుకోకపోవడం అదేవిధంగా విద్యాశాఖ అధికారులు వెంటనే శ్రీ చైతన్య విద్యాసంస్థల మీద చర్యలు తీసుకొని యజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, నగర సహాయ కార్యదర్శి నివిన్, నాయకులు సుధాకర్, టోకు, సంద్య పాల్గొన్నారు.

More articles

Latest article