నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత అల్పాహారం (పులిహోర) అందించినట్టు సుభాష్ నగర్ సీనియర్ సిటిజన్ ఫోరం కార్యదర్శి డా.విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కలెక్టర్ నూతన భవన సముదాయంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అల్పాహార పంపిణీకి తోడుగా త్రాగు నీరు సరఫరా చేసిన రాజస్థానీ వాకర్స్ గ్రూప్ వారికి ఫోరం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత గుజరాతీ రాజేశ్వర్, ఫోరం సభ్యులు శ్రీ రాములు, వెంకటరెడ్డి, లింగయ్య, దేవులానాయక్, రవీంద్రనాథ్, శ్రీనివాస్ అయ్యవార్, భూమయ్య, ధర్మరాజు, సత్యనారాయణ, దుర్గయ్య పాల్గొన్నారు.
