24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రైతు కమిషన్ చైర్మన్, సభ్యుల పుష్కర స్నానం

Must read

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం, బతుకమ్మ: సరస్వతి పుష్కరాల్లో రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు సభ్యులు గడుగు గంగాధర్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి తదితరులు గురువారం పుణ్యస్నానాలు ఆచరించారు. వీఐపీ ఘాట్ వద్ద పుష్కర స్నానం చేసిన అనంతరం కాళేశ్వరంలోని ముక్తేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వరున్ని వేడుకున్నట్లు చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్నదాతకు అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు. దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వర పుష్కరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Farmers Commission Chairman and members take a bath in Pushkara Snan

More articles

Latest article