. . . ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:
నలభై లక్షల సివిల్ దావాను తగిన సాక్ష్యాలు లేవని కొట్టివేస్తు నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ తీర్పు చెప్పారు. బుదవారం కోర్టు వెలువరించిన ఇరవై పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం రామన్న పేట్ గ్రామానికి చెందిన పత్రి పోచయ్య తన న్యాయవాది ద్వారా నలభై లక్షల రూపాయల రికవరీ దావా దాఖలు చేశాడు. బాజిరెడ్డి రమాకాంత్, అరిగెల జనార్ధన్, కొంపల్లి మల్లేష్, పాలెం గంగాధర్, కాకి విజయ, కుంటం రాధ, కుంటం గంగాధర్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదులందరు రామన్న పేట్ లోని తన ఇంటి పరిసరాలలోకి అక్రమంగా ప్రవేశించి ప్రోక్లేయిన్ తో మొత్తం ఇంటిని కూల్చి వేశారని దాని మూలంగా తనకు ఇరవై లక్షల నష్టం జరిగిందని తెలిపాడు. ఇంటిని పునర్ నిర్మించాడానికి నలభై లక్షల ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. నెలవారిగా మరో ఐదు వేల రూపాయలు నష్టపోయానని వివరించారు. నష్ట పరిహారంగా పది లక్షలు, ఇంటిని నష్ట పరిచినందున ఇరవై లక్షలు, ఇంటిని తిరిగి నిర్మించించడానికి మొత్తం నలభై లక్షల ఖర్చు అవుతుందని అంత మొత్తం ప్రతివాదుల నుండి ఇప్పించాలని కోరాడు.ప్రతివాదులు కోర్టుకు సమర్పించిన లిఖిత పూర్వక జవాబులో తాము పత్రి పోచయ్య ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించ లేదని, ఇంటిని కూల్చి వేయ లేదని దావాలో పేర్కొన్నట్టు నలభై లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరమే లేదని తెలిపారు.పిటిషన్ దారు తరపున ముగ్గురి వాంగ్మూలాలు నమోదు చేసి పద్నాల్గు డాక్యుమెంట్స్ ను మార్క్ చేశారు. బాజిరెడ్డి రమాకాంత్ తదితరుల తరపున ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు కాపీ నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పులు మార్క్ చేశారు. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విని సాక్ష్యధారాలను పరిశీలించి పత్రి పోచయ్య దాఖలు చేసిన నలభై లక్షల సివిల్ దావాను కొట్టివేస్తు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు చెప్పారు.
