24 C
Hyderabad
Sunday, August 2, 2026

పక్షోత్సవాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

  • దీపావళికి ముందే ప్రారంభమైన పేకాట
  • ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న జూదం
  • చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు
  • కామారెడ్డిలో ప్రారంభమైన వేట

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాట జోరందుకుంది. దీపావళి పండుగ పక్షం రోజులు ఉండగానే జూదగాళ్ళు పేకాటను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో పేకాట దశాబ్ధాలుగా దసరా పండుగ ముగిసిన వెంటనే దీపావళి వరకు జోరుగా సాగే సాంప్రదాయంగా వస్తుంది. ఒకప్పుడు బహిరంగంగా పత్తాలాట ఆడే వారు కానీ పోలీసు శాఖ ఉక్కుపాదం మోపడంతో పేకాట రహాస్య స్థావరాలకు మారింది. ఈసారి దీపావళి పండుగ దసరా పండుగకు పక్షం రోజులే తేడా ఉండడంతో పేకాట జోరందుకుంది. ఉత్తర భారతం నుంచి వచ్చిన పండుగ నాటి పేకాట కల్చర్ ఆంధ్రా నుంచి వచ్చిన ఆటవిడుపు కాస్తా జిల్లాలో పత్తాలాట పెద్ద ఎత్తున సాగుతుంది. ఒకప్పుడు ప్రైవేట్ క్లబ్ లో జోరుగా సాగిన పేకాట పోలీసు శాఖ అణచివేతతో రహస్య స్థావరాలకు మారింది. హైదరాబాద్ లో క్లబ్ లపై నిషేదం విధించిన తర్వాత జిల్లా వాసులు పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లి పేకాట ఆఢుతున్నారు. పేకాట నిర్వాహకులు అర్గనైజర్లుగా అవతారమెత్తి ఏకంగా దుబాయ్, మలేషియా, సింగాపూర్ మొదలుకుని గోవాకు తీసుకుని పేకాట ఆడించే కల్చర్ జోరందుకుంది.

దీపావళి పండుగకు వారం రోజులు ఉండడంతో పేకాట జోరందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న పేకాట రాయుళ్ళు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ , జిల్లా కేంద్రానికి చెందిన మరికొందరు ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, మహారాష్ట్రలోని దెగ్లూర్, ధర్మాబాద్ తాలుకు చెందిన వ్యక్తులు ఆర్గనైజర్లుగా పేకాటను నడిపిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బంగారాన్ని ఫణంగా పెట్టి పేకాట ఆడే కల్చర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, ఆర్మూర్ లో ఉంది. ఈసారి బంగారం ధర ఇప్పుడే లక్షా 30 వేలు దాటగా పేకాటలో బంగారం పాత్ర ఎంత అనే చర్చ జరుగుతుంది. అయితే పేకాట మాత్రం జోరందుకుంది. పోలీసు బాసుల పర్యవేక్షణలో ఉండే టాస్క్ ఫోర్స్ లేకపోవడం  నిజామాబాద్ జిల్లాలో పేకాట రాయుళ్ళకు వరంగా మారింది. వర్ని, రుద్రూర్, నిజామాబాద్ రూరల్ మండలంలోని అటవీ ప్రాంతాల్లో, నస్రుల్లాబాద్ర్ మండలం అటవీ ప్రాంతంలో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దీపావళి పండుగ నాడు పేకాట ఆడే కల్చర్ బడా వ్యాపారులు మొదలుకుని లీడర్ల వరకు ఉంది. వారే పేకాటను సాంప్రదాయంగా మార్చరనే అపవాదు కూడా ఉంది.

నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ లేకపోవడంతో దాని భారమంతా సీసీఎస్ పైన పడింది. స్థానికంగా పోలీసు అధికారులకు తెలిస్తే పేకాట జరుగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. కామారెడ్డి జిల్లాలో గడిచిన రెండు రోజుల్లోనే పేకాటరాయుళ్ళ ఆటను ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలోని టీం ఆటకట్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11న రాత్రి సీసీఎస్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పండుగ పూట జరుగుతున్న పేకాట వ్యవహరం స్థానిక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. అన్ సీజన్ లో పేకాట ఆడుకునేందుకు లోపాయికారిగా సహకరించిన వారు పండగకు సహకరించరా అని ధీమాతో పేకాటను నిర్వాహకులు జోరుగా సాగిస్తున్నారు. కొందరు మాజీ పోలీసులే పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూదాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఒక టీచర్స్ క్లబ్ పేకాటకు కేరాఫ్ అన్న ఆరోపణలు మూటగట్టుకుంది. కొందరు అధికారులకు సంబంధించిన క్లబ్ లోనూ పేకాట జోరుగా సాగుతుందన్న వాదనలున్నాయి. అధికారులు లేకపోయినా లీడర్లే అక్కడ పేకాటను ఆడుతూ మూడు ముక్కల ఆటను ఆడుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల పేరు చెప్పి జరుగుతున్న పేకాటపై పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి.

More articles

Latest article