28.2 C
Hyderabad

పోలీసుకు ముప్పు కలిగించే ప్రయత్నాలు

Attempts to pose a threat to the police

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఒకరికి జైలుశిక్ష

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  : 

 

ఓ పోలీస్ హోమ్ గార్డ్ కు ముప్పు కలిగించే విధంగా డ్రైవ్ చేసిన బొక్క దీపక్ కు ఆరు నెలల జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు.తీర్పులోని వివరాలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2026,మార్చి 30 న సాయంత్రం నగరంలోని పవర్ హౌస్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి తన బైక్ ను అజాగ్రత్తగా, అతివేగంగా డ్రైవ్ చేసుకుంటు రాగా అక్కడ విధులలో ఉన్న పోలీస్ హోమ్ గార్డ్ కాడాసి నర్సింగ్ బైక్ ను ఆపమని సూచిస్తూ వెళ్లగా బైకర్ వేగంగా వచ్చి టక్కర్ ఇవ్వడంతో నర్సింగ్ కిందపడి గాయలపాలయ్యాడు. అక్కడే విధులలో ఉన్న మిగతా పోలీసులు బైకర్ ను పట్టుకొని వివరాలు అడుగగా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన బొక్క దీపక్ గా తెలిపాడు.నర్సింగ్ పట్టణ ఐదవ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు  నేర విచారణ పూర్తి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.చార్జీషీట్ అనుసారం సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసిన కోర్టు ముద్దాయి దీపక్ పై నేర అభియోగాలు రుజువైనట్లు తీర్పు వెలువరించింది.భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 125(ఎ ) ప్రకారం అధికారిక విధులలో ఉన్న వ్యక్తికి ముప్పు కలిగే విదంగా ఉన్న ముద్దాయి దీపక్ చర్యలు ఉన్నందున ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విదిస్తూ జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరజ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article