25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నీట మునిగి వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువు లో  బాలాజీ నాగర్ తండా కు చెందిన గణేశ్ (48) అనే వ్యక్తి  మంగళవారం సాయంత్రం  ప్రమాదవశాత్తు  పడిపోయాడు.  అటుగా వెళ్తున్నహోం గార్డ్ ఆంజనేయులు   నీటి లో మునుగుతున్నగణేశ్ ని చూసి  కాపాడటానికి చెరువులోకి దూకాడు. ఆంజనేయులు ప్రయత్నం విఫలమై అతడి కళ్ల ముందే గణేశ్ నీట మునిగి గల్లంతయ్యాడు.   గణేశ్ మునుగుతున్న చోటుకు ఆంజనేయులు ఈదుకుంటూ వెళ్లిన కనిపించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.  గణేశ్ మృతదేహం కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

More articles

Latest article