శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

0 86,524
  • 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాక
  • ప్రస్తుతం ప్రాజెక్టులో  1070 అడుగుల నీటి మట్టం

 

 మెండోరా, బతుకమ్మ :  ఉత్తర తెలంగాణ వర ప్రదాయని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధ్రుతి పెరిగింది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిన ఇప్పటికీ శ్రీరాం సాగర్ అత్యధికంగా 5 వేల క్యూసెక్కుల మించి ఇన్ ఫ్లో రాలేదు. ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఏకైక ఆధారమైన శ్రీరాం సాగర్ కు గత రెండు రోజులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 52765 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో తక్కువగా సాగుకు కాకతీయ, లక్ష్మి కాలువల ద్వార, గుత్ప, ఆలీసాగర్, హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల  ద్వారా పంటలు పండిస్తున్నారు. అయితే పొరుగు జిల్లాలు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆధారం. ఎస్ఆర్ఎస్ పికి గోదావరి, మంజీరా, హరిద్రా నదుల ద్వార వరద రావడం సాధారణం. మంజీరా నుంచి వరద రావడం లేదు.  గోదావరి నది వరద ఎగువ ఉన్న ప్రాజెక్టులను దాటుకుని రావడం ఆలస్యం కావడంతోనే ఈ సారి పోచంపాడుకు వరద రావడం లేట్ అని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో ప్రస్తుతం మహారాష్ట్రలో వానలు దంచి కొడుతుండగా, కర్నాటక,  నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సగటు వర్షపాతంను మించి పడకపొవడంతో గోదావరి వరద  పెరుగకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు  ఈనెల 22న 608 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. ఆనాడు ప్రాజెక్టులో 21.029 టియంసీలు. ఈ నెల 26న ప్రాజెక్టుకు 4500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉదయం 9 గంటలకు రికార్డైంది. సాయంత్రానికి 6500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. శనివారం అర్ధరాత్రి 10,500 క్యూసెక్కుల వరద మెల్లిగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం  6 గంటలకు 10,484 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 9 గంటలకు వరద పెరిగి 20,370 క్యూసెక్కులు అయింది. మధ్యాహ్నం 12 గంటలకు 24500 క్యూసెక్కులు కాగా  మధ్యాహ్నం 3 గంటలకు 37036 క్యూసెక్కుల వరదకు పెరిగింది. సాయంత్రం 4 గంటలకు 50,503 క్యూసెక్కుల వరద ఉండగా సాయంత్రం 6 గంటల వరకు 52765 క్యూసెక్కుల ఇన్ ఫ్లో గా పెరిగింది. 22 న 20.518 టియంసీల నీరు ఉండగా ఆదివారం సాయంత్రం వరకు 24.237 టియంసీల నీరు నిల్వఉంది. జూన్ 1 నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 13.045 టియంసీల వరద రాగా 3.099 టియంసీల ఔట్ ప్లో గా వెళ్లింది. దాదాపు ఐదు రోజుల కాలంలో నాలుగు టియంసీల వరద రావడంతో ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. ఐతే గత ఏడాది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 29.933 టియంసీల నీరు 1069 అడుగల నీరు నీల్వ ఉండగా ఈ సారి ఐదు టియంసీలు తక్కువగా ఉంది.

  • శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ

ఆదివారం సెలవు రోజు కావడంతో ఆట విడుపుగా  చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించడానికి రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. ప్రాజెక్టు అందాలను, జలదృశ్యాలను, దిగువ ప్రాంతంలో ఉన్న పార్కు   అందాలను పర్యాటకులు ఆస్వాదించి పచ్చని పైరులో వన భోజనాలు చేసి ప్రాజెక్టు తీరంలో సంతోషంగా సేద తీరారు.

Leave A Reply

Your email address will not be published.