శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాక ప్రస్తుతం ప్రాజెక్టులో  1070 అడుగుల నీటి మట్టం    మెండోరా, బతుకమ్మ :  ఉత్తర తెలంగాణ వర ప్రదాయని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధ్రుతి పెరిగింది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిన ఇప్పటికీ శ్రీరాం సాగర్ అత్యధికంగా 5 వేల క్యూసెక్కుల మించి ఇన్ ఫ్లో రాలేదు. ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఏకైక ఆధారమైన శ్రీరాం సాగర్ కు గత రెండు రోజులుగా...