27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ లోని నాగోల్ లో ఘటన

హైదరాబాద్, బతుకమ్మ : షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో చోటుచేసుకుంది. నాగోల్ లో షటిల్ ఆడుతుండగా గుండ్ల రాకేష్ (25) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ. తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో రాకేష్ ఉద్యోగం చేస్తున్నాడు.

More articles

Latest article