27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జనవరి 26న నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో ఫిషింగ్ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ భాయ్) చేపల వేట పోటీలను  నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని, స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన హాబి కల్గి ఉండాలన్నారు. ఇదివరకే జూరాల ప్రాజెక్టులో సైతం చేపల వేట పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఫిషింగ్ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు రూ.1500 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముగ్గురు గల జట్టు టీం పట్టిన చేపల బరువు బట్టి గెలుపును నిర్ధారిస్తామన్నారు. గెలుపొందిన టీంకు బహుమతిగా ఒక లక్ష రూపాయలు, ట్రోఫీ బహుమతిని అందజేస్తామన్నారు. జనవరి 26 న నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో ఫిషింగ్ పోటీలు ఉంటాయని దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 20 ఆఖరు తేదీ అని నిర్వాహకులు మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ బాయి) సూచించారు. మరిన్ని వివరాలకు 7995926581 నెంబర్ పై సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ కరమత్ పాల్గొన్నారు.

More articles

Latest article