నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హన్మకొండ లోని డి ఎస్ ఏ మైదానం లో జరుగుతున్నా సిఎం కప్ సెపక్ తక్రా టోర్నమెంట్ లో జిల్లా మహిళ ల జట్టు మూడవ స్థానం సాధించిందని జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యాదర్శి గాధరి సంజీవరెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పదమూడు జట్లు పాల్గొనగ నిజామాబాదు మూడవ స్థానం సాధించిందని తెలిపారు. జట్టులో రిక్కీ రెడ్డి, లక్కీ రెడ్డి మంచి ప్రతిభను కనబర్చారని తెలిపారు.జట్టు కోచ్, మేనేజర్ లు గా చామ కూర భాగరెడ్డి, సంజీవ రెడ్డి వ్యవరించారని అన్నారు.
