27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: షార్ట్ సర్క్యూట్ కారణంగా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివాలయ వీధి ప్రాంగణంలోని వెండి సాయిలు అనే వ్యక్తికి చెందిన పెంకుటిల్లుకు మంటలు అంటుకోగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరగగా, విలువైన పత్రాలు, నగదు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Fire hazard with short circuit

More articles

Latest article