కామారెడ్డి, బతుకమ్మ : భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజాంసాగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా నర్సింలు అనే వ్యక్తి తన భార్య మహేశ్వరిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సింలు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
