29.2 C
Hyderabad

భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష

Husband sentenced to 10 years in prison for causing wife's suicide

Must read

📰 Generate e-Paper Clip

 

-నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్త దుబ్బాక బాలస్వామి కి రెండు నేరాలు కుగాను పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు వెలువరించా రని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.జడ్జీ తీర్పు ప్రకారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి ) గ్రామ నివాసులైన బాలస్వామి,సబ్బని ఉమా మహేశ్వరి ప్రేమించుకుని ఏప్రిల్ 2012 సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్నారు.వీరి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు.వారి పిల్లలు పది ఎనిమిదేళ్లకు ఎదిగారు.పదేళ్లు వారి జీవితం ఒడిదుడుకులతో కొనసాగింది. డబ్బులు అవసరమైనప్పుడు భార్యను శారీరకంగా హింసించి, మానసిక బాధలకు గురి చేసి పుట్టింటి నుండి తీసుకురమ్మని బలవంతంగా పంపించేవాడు బాల స్వామీ.కూతురు భాధలు చూడలేక అవసరమైనప్పుడు ఉమా తల్లి సబ్బని నిర్మల ఆదుకునేది. ధర్మారం గ్రామంలో నిర్మలకు ఓపెన్ ప్లాట్ ఉన్నది అది అమ్మివేసి అందులో వచ్చే సగం డబ్బులు ఇచ్చే విధంగా తల్లితండ్రులను బలవంతం చేయమని కొన్నేళ్లుగా భార్యను వేధింపులు చేయసాగాడు. భర్త వేధింపులు భరించలేక ఉమా మహేశ్వరి 2024 సెప్టెంబర్ 20న తన ఇంట్లో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణ లో రుజువై నట్లు సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పు లో నిర్దారించారు.భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 85 భార్య పట్ల క్రూరత్వం గా ప్రవర్తించినందుకు గాను మూడు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. సెక్షన్ 108 ఆత్మహత్యకు ప్రేరేపించే అందుకుగాను మరో ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా ఖరారు చేశారు. జరిమానాలు చెల్లించని యెడల అదనంగా మూడు నెలల చొప్పున జైలుశిక్ష అనుభవించాలని సెషన్స్ జడ్జి భారత తమ తీర్పు లో పేర్కొన్నారు.జైలు శిక్ష లన్నీ ముద్దాయి బాలస్వామి ఏకకాలంలో అనుభవించాలని తమ తీర్పు చెప్పారు.

More articles

Latest article