మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన బోలమల తరుణ్ (22) అకాల మరణం చెందడంతో ఆ విషయాన్నీ తెలుసుకున్న మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిస్టరీ అధ్యాపకులు పరశురామ్ పూర్వ విద్యార్థులకు తెలిపారు. దీంతో పూర్వ విద్యార్ధి నాయకులు తడపాకల్ నలిన్ వాట్సాప్ స్టేటస్ ద్వారా తరుణ్ చనిపోయాడనే విషయాన్నీ స్నేహితులకు తెలిపి మనమ మందరం తోచిన సహాయం చేయాలనీ అనుకోని పూర్వ విద్యార్థులకు సంబంధించిన గ్రూప్ లో పెట్టగానే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోని తమ వంతు సహాయం చేయాలనీ మందుకోచ్చి సుమారు రూ. 7,000 జమచేసి తరుణ్ కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హిస్టరీ అధ్యాపకుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
