27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధి హామీపై గ్రామసభ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. సందర్భంగా ఏపీవో శకుంతల మాట్లాడుతూ రాబోయే సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ తయారీ గ్రామంలో చేపట్టబోయే పనుల గురించి ఆమోదంపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ఉపాధి హామీ పథకం గ్రామాల అభివృద్ధికి ముఖ్యమైన కార్యక్రమం అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు గుర్తించి పారదర్శకంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్ర మోహన్, కారోబర్ పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article