25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తెయూలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లో తక్షణ ప్రవేశాల భర్తీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి కోర్సుల్లో  ఖాళీగా ఉన్న 14 సీట్లకు 12 ,  ఎల్.ఎల్.ఎం లో ఖాళీగా ఉన్న ఒక  సీటు ను 2024 స్టేట్ ఎంట్రన్స్ ర్యాంకు మెరిట్ ఆధారంగా  రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ విశ్వవిద్యాలయ నిబంధనలను అనుసరించి తక్షణ ప్రవేశాలను  భర్తీ చేశామని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ తక్షణ ప్రవేశాల్లో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ  ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించి ఎంపికైన విద్యార్థుల వివరాలు  ప్రకటించామని అడ్మిషన్స్ డైరెక్టర్ పేర్కొన్నారు.తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియంబర్స్మెంట్,  హాస్టల్ వసతి  ఇవ్వబడదన్నారు.

Filling of immediate admissions in LLB, LLM in TU

More articles

Latest article