ఛలో రాజ్ భవన్ విజయవంతం చేద్దాం

0 1,452

 జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు

కామారెడ్డి, బతుకమ్మ : 18న టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో రాజ్ భవన్ విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణ తో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్  దీపా దాస్ మున్షి , మంత్రులు, ప్రభుత్వసలహాదారులు ,ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు.  అమెరికా లో గౌతమ్ ఆధాని పై వచ్చిన ఆర్థిక అవకతవకలు వ్యాపార, ఆర్థిక రంగాలలో దేశ పరువును దెబ్బతీసాయని అన్నారు.. ఆధాని పై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయని తెలిపారు. అలాగే మణిపూర్ లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం  చలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.