. . . పెద్ద ప్రాంతాల్లో అధికార పార్టీ బీజేపీ మధ్య తీవ్ర పోటీ
. . . భీంగల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద లో కాంగ్రెస్ తో కారు సై
. . . నిజామాబాద్, బోధన్ లో మజ్లిస్ మద్దత్తు ఉంటేనే పీఠం
. . . పార్టీల అంచనాలను తలకిందులు చేస్తున్న ఎగ్జిట్ పోల్స్
నిజామాబాద్, బతుకమ్మ :
పంచాయతీ ఎన్నికలను ఇట్టే గట్టేక్కాం. మాకు ఎదురెందని ధీమాతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు ముచ్చెమటలు పట్టించాయి. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా నిలిచామని రెండవ స్థానంలో ఉన్నామని కారు పార్టీ జబ్బలు చరుచుకున్నది కానీ పుర పోరుకు వచ్చేసరికి దాని ధీమా సడలింది. తొలిసారి పంచాయతీ పాగా వేసామని పట్టణ ఓటర్లు తమ జేబులో ఉన్నారన్న కమలం పార్టీలో నిన్నటి వరకు ఉన్న భరోసా ఇప్పుడు కనిపించడం లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే దానితో అంట కాగి మున్సిపల్ ఎన్నికలలో అధికారంలో పంచుకునే మజ్లిస్ పార్టీకి కూడా క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో అన్ని పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తాము ఒకటి తలిచితే ఓటరు దేవుడు మరొకటి తలిచాడు అని భయం అన్ని పార్టీల నాయకులను పట్టి పీడిస్తోంది.. తాము ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుస్తాడని ధీమా రాజకీయ పార్టీల నాయకులలో కనిపించడం లేదు. రెబల్స్ ఎక్కడ తమ ఓటు బ్యాంకును దెబ్బతీసారని అనుమాన పడుతున్నాయి. కొందరు పార్టీ నాయకులే వ్యతిరేకంగా పనిచేశారని, క్యాడర్ కూడా కొంత సహకరించలేదని భయం పార్టీలను పట్టుకుంది. మున్సిపల్ ఓటింగ్ సరళి ఆధారంగా అన్ని పార్టీలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ను అందులో వ్యతిరేక ఫలితాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రచారం నాటి ధీమా పోలింగ్ నాటికి నాయకులలో కనిపించకపోవడమే అందుకు నిదర్శనం అని చెప్పాలి.
అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని 8 బల్దియాలపై తమ పార్టీ జెండా ఎగురుతుందని దిమాతో ఉంది. తొలిసారి బల్దియా ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం తమకు కలిసి వస్తుందని నేతల ఐక్యత రాగం కూడా తమకు లాభం చేకూరుస్తుందని అంచనావేస్తుంది.. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలపైనే గురింపెట్టింది.. మిత్రపక్షం మజిలీస్ తో స్నేహపూర్వక పోటీ అనేది ఘర్షణలతో తేటతెల్లమైంది. 22 డివిజన్ లలో మైనార్టీలు బలంగా ఉండగా ఆయా స్థానాలలో 16 డివిజన్ లాలో పతంగి పార్టీకి తాజా మాజీలు ఉన్నారు. అక్కడ వారు బరిలో దిగడం, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను బరిలో గెలుపు ఎవరిది అనేది బ్యాలెట్ బాక్స్ లో ఎవరికి ఓటు వేశారు అనేది ప్రశ్నగా మిగిలింది. బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సవాడ, ఎల్లారెడ్డి లు హస్తగతం చేసుకుంటామని ధీమా ఉన్నా అక్కడ వారికి మజ్లిస్ మద్దతు లేకుంటే గట్టేక్కడం కష్టమే. భీంగల్,బిచ్కుంద లో బిఆర్ ఏస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోధన్,ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీ లపై బిజెపి గంపెడు ఆశలు పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గ కేంద్రాలకు బిజెపి ఎమ్మెల్యేలు ఉండటం ఒక కారణం. బోధన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో మూడవ స్థానానికి పరిమితమైన పట్టణంలో గణనీయంగా ఉన్న ఓట్ల బలంతో ఆ పార్టీలో నిన్నటి వరకు ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికలో చాలామందిపై ఆరోపణలు ఉన్నప్పటికీ తాజా మాజీ లకి టికెట్లు ఇవ్వడం మున్సిపల్ కార్పొరేషన్ లో కొంప ముంచుతుందని భయం పట్టుకుంది. గతం లో 28 సీట్లు రాగా ఆ స్థాయిలో సీట్లు వచ్చిన మేయర్ పీఠం మనదే అని కషాయం పార్టీ ధీమాతో ఉంది. అయితే పోలింగ్ తర్వాత లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 20 సీట్లు సాధించడం కష్టమేనే భావనకు బీజేపీ వచ్చినట్టు కనిపిస్తుంది. కామారెడ్డి,ఆర్మూర్ మున్సిపాలిటీ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు జరిగింది. బోధన్ లో బీజేపీ కీ రెండోస్థానం దక్కుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో రెండవ స్థానంలో నిలిచామని తమకు పట్టణ ఓటర్లు కూడా ఆదరిస్తారని నమ్ముకున్న కారు పార్టీకి మున్సిపల్ ఎన్నికలు షాక్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భీంగల్, బిచ్కుంద, బాన్సవాడ, ఎల్లారెడ్డి లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన అది నాలుగింటిలో ఒక్కదానిలో కూడా పాగా వేస్తుందా లేదా అనే భయం పట్టుకుంది. పట్టణ ప్రాంతాల ఓటర్ల తో తాజా మాజీలకు సంబంధాలు అంతంతే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీలు ఎన్నికల కోసమే ఓటర్ల వద్దకు రావడం, అప్పటికే కార్ స్థానం ను కమలం కబ్జా చేసిందని దానితో క్రాస్ ఓటింగ్ జరిగిందని భయం పట్టుకుంది. మున్సిపల్ ఎన్నికలలో తమ సత్తా చాటి జిల్లా పరిషత్ ఎన్నికలకు సమాయత్తం కావాలనుకున్న కారు పార్టీకి ఓటరు కర్రు కాల్చి వాత పెట్టడం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మజ్లిస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల లో మాత్రం తన బలం పెంకకోవడం ఖాయం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలలో అధికార పార్టీకి పీఠాలు దక్కాలంటే తమ మద్దతు తప్పనిసరి అని ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగిన బిఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు తమ ఖాతాలో పడ్డాయని తమకు సీట్లు పెరగడం గ్యారంటీ ఆ ని పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఆయా పార్టీల లెక్కలు, సర్వే రిపోర్టులు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవే చెబుతున్నాయి. మొత్తానికి పురపాలక ఓటరు దేవుడు ఏ పార్టీని కరుణించాడో, ఎవరికి అందలం ఎక్కిస్తాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కౌంటింగ్ ప్రక్రియలో క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనేది అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు రావచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు.
