. . . ఒకరికి తీవ్ర గాయాలు….
కోటగిరి, బతుకమ్మ :
పాడుబడ్డ (పురాతన) రైస్ మిల్ గోడ కూలీ ఇంటిపై పడి అందులో నిధ్రిస్తున్నయువకుడితోపాటు నెలన్నర చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం కోటగిరి మండల కేంద్రంలోని మాలవాడకు చెందిన ఇందూర్ మహేష్(25) భార్య మహేశ్వరి, తమ నెలన్నర కూతురు తో వారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంగళవారం ఉదయం సుమారు 6గంటల ప్రాంతంలో వారి ఇంటికి ప్రక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ ఒక్కసారి కూలింది. పక్కన ఉన్న కూనిళ్లు( రేకుల షేడ్) పై పడటంతో అందులో నిద్రిస్తున్న ఇందూర్ మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించడంతో మహేశ్వరి గాయాలతో బయటపడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్ని సంవత్సరాలుగా పాడుబడ్డ రైస్ మిల్ శిథిలా వ్యవస్థకు చేరినప్పటికీ పట్టించుకోకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలిపని చేసుకునే పొట్టపోసుకునే మహేష్ అతని చిన్నారి కూతురు దుర్మరణం స్థానికంగా కలిచివేసింది. రైస్ మిల్ యాజమాన్యం పై చర్య తీసుకుని మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.కోటగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు….
పూరాతన మిల్లుల పేరిట దందా?….
కోటగిరి లో చాలా మటుకు రైస్ మిల్లులు నడుస్తున్నాయని అధికారుల రికార్డులలో ఉండగా చాలమటుకు అవి పాడుబడిన లేదాపూరతన మిల్లులుగా చెప్పాలి. సీఎంఆర్ కోసం కొన్ని మిల్లులు ఉండగా వాటివల్ల పౌరసరపరాల శాఖ నుంచి వడ్లు తీసుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అంతే కాకుండా పిడిఎస్ బియ్యం గోదాముల ఉపయోగపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 200 కోట్ల సీఎంఆర్ కుంభకోణంలో కోటగిరి రైస్ మిల్లులకు ముడిపడి ఉన్నాయి. పోలీస్ కేసులు అయిన సంగతి తెలిసిందే….