24 C
Hyderabad
Sunday, August 2, 2026

కన్న కొడుకును చంపిన తండ్రి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

బతుకమ్మ : నాగిరెడ్డిపేట :

 నాలుగు రోజుల క్రితం భార్య పైన కోపంతో తన నాలుగేళ్ల కుమారుడిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపిన తండ్రిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. కన్న కొడుకుని చంపిన హత్య కేసు వివరాలను ఆదివారం ఎల్లారెడ్డి సిఐ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అక్షిత-అనిల్ దంపతులు పిల్లలతో కలిసి శాలిపేట్‌లో జరిగే బోనాల పండగకు బంధువుల ఇంటికి వెళ్లారు.అనిల్ కుమారుడు శశాంక్(4),అనిల్ సోదరి కూతురును తోసివేయడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తర్వాత పోల్కంపేటకు చేరుకున్న భార్య భర్తలు ఇద్దరు గొడవపడగా భార్యపై అనిల్ చేయిచేసుకున్నాడు. దానితో అనిల్ భార్య పిల్లలను తీసుకొని పోచారం గ్రామంలోని అత్తారింటికి వచ్చాడు. తర్వాతి రోజు కొడుకును బయటకు తీసుకెళ్లి బైక్ పై తింపుకొస్తానని చెప్పి శశాంక్‌ను అనిల్ ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కాదా అనిల్ పరారీలో ఉండగా నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా అనిల్ ను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article