27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వృద్దురాలి  కాళ్లపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ

నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కేందుకు యత్నించిన వృద్దురాలు ప్రమాదవశాత్తు జారి పడటంతో  కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన  ఆదివారం సాయంత్రం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన అంజవ్వ (50) నగరంలోని బోధన్ రోడ్డు లోని పాత ( బోదన్ రోడ్డు) ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్ ఎక్కేందుకు యత్నించగా జారీ పడింది. అదే సమయంలో బస్ ముందుకు కదలడంతో అంజవ్వ కాళ్లపై నుంచి టైర్లు వెళ్లడంతో కాళ్లు  నుజ్జు అయ్యాయి. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆర్టిసి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాధం జరిగిందని స్థానికులు మండిపడ్డారు.

 

RTC bus runs over elderly woman's legs

More articles

Latest article